చాకలి ఎస్సీ మహాసభను విజయవంతం చేయాలి: సాంబలక్ష్మి

చిట్యాల, ఆంధ్రప్రభ: ఈ నెల 6న హైదరాబాద్‌లో చాకలి ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా చాకలి ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు గోపరాజు సాంబలక్ష్మి పిలుపునిచ్చారు.

శనివారం చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మూసాపురి కుమారస్వామి ఆధ్వర్యంలో మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సాంబలక్ష్మి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రస్తావించారని గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు.

చాకలి కులస్తులు అధిక సంఖ్యలో హైదరాబాద్ మహాసభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు ముసాపూర్ రవీందర్, శ్రీనివాస్, కుమార్, నరసయ్య, రామ్‌కిషన్, రమేష్, గంగాధర్, వీరయ్య, ఉప్పుల రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.