యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో స్థానికులకు చోటు కల్పించాలి
- ఆలేరు అసెంబ్లీ బిజెపి కన్వీనర్ చిరిగె శ్రీనివాస్
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పుణ్యక్షేత్ర ట్రస్ట్ బోర్డు నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆలేరు అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ చిరిగె శ్రీనివాస్ విమర్శించారు.
శనివారం ఆయన మాట్లాడుతూ, దేవాలయ నిర్మాణ పనుల కోసం భూములు ఇచ్చిన స్థానిక రైతులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారికి ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించకపోవడం విచారకరమన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి ఆలేరు ప్రాంతానికి ప్రాతినిధ్యం కల్పించేలా ట్రస్ట్ బోర్డులో స్థానికులకు అవకాశం ఇవ్వాలని చిరిగె శ్రీనివాస్ కోరారు.
