దొడ్డి కొమరయ్యకు బీసీ సంక్షేమ సంఘం ఘన నివాళి
సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): తొలి తరం అమరుడు, స్వాతంత్ర్య పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య త్యాగస్ఫూర్తి, పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభుగౌడ్, ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కవేలి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, కోశాధికారి కే. సుధాకర్ గౌడ్, సలహాదారులు కరణ్‌జిత్ సింగ్, నాయకులు బీరయ్య యాదవ్, డాక్టర్ శ్రీహరి యాదవ్, వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
