Bhadrachalam Temple | శ్రీ సీతారాముల సన్నిధిలో ఐజీ
Bhadrachalam Temple | శ్రీ సీతారాముల సన్నిధిలో ఐజీ
భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు
Bhadrachalam Temple | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం ఐజీ తిరుజ్ఞాన సంబంధాన్ భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ముందుగా ఆలయ మర్యాదల మధ్య గర్భాలయంలోకి వెళ్లిన ఐజీ, శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల సంక్షేమం, దేశ శాంతి, ప్రజల సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేసినట్లు సమాచారం. దర్శనం అనంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యం గురించి అర్చకులు ఐజీకి వివరించారు. భక్తుల కోసం దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై కూడా ఆయన ఆరా తీసినట్లు తెలిసింది.
ఐజీ పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, ఆలయ ఈవో, అర్చకులు, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఐజీ ఆలయ అధికారులతో కొద్దిసేపు సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
