హనుమాన్ స్పోర్ట్స్ షాపులో చోరీ..
నల్గొండ, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా కేంద్రంలో హనుమాన్ స్పోర్ట్స్ షాపులో చోరీ ఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటుచేసుకుంది.
నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాపులో గుర్తు తెలియని దుండగులు షట్టర్‌ను జాకీతో లేపి లోపలికి ప్రవేశించారు. కౌంటర్‌లో ఉన్న రూ.3,50,000 నగదును ఎత్తుకెళ్లినట్లు షాపు నిర్వాహకుడు కంభంపాటి సత్య గౌడ్ తెలిపారు.
ఈ ఘటనపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
