ఆక్రమణలు తొలగించిన అధికారులు.
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ మండల కేంద్రంలోని పెనుగంచిప్రోలు లోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం కు వెళ్ళు ప్రధాన రహదారిలో రోడ్ల పైకి వచ్చిన చిరు వ్యాపారులను, అలాగే రహదారిని ఆక్రమించిన వారిని స్థానిక ఎస్సై అర్జున్ పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమారులు దగ్గరుండి అక్రమాలను తొలగించారు. గత కొంతకాలంగా తిరుపతమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ప్రైవేటు వాహనంలో భారీగా వస్తుండడంతో ప్రతినిత్యం రోడ్ల ఆక్రమణ వల్ల స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని పలువురు ఫిర్యాదు మేరకు అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చి నిబంధనలు పాటించని వారి బల్లలు తోపుడు బండ్లు వంటి వాటిని పంచాయతీ సిబ్బంది తొలగించారు.
పోలీస్ స్టేషన్ వద్ద మారని తీరు..
స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద మాత్రం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోపోవడం పై పలు పలు అనుమానాలకు తోవిస్తుంది ప్రధాన కూడలి కావడం వల్ల పెద్ద సంఖ్యలో వాహనాలు నాలుగు రోడ్లు క్రాస్ అవ్వటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద కూడా ఎటువంటి మినాయింపులు లేకుండా ఆక్రమణలు తొలగించాలని పలువురు కోరుతున్నారు.
బస్ స్టాప్ మారటంతో భక్తులు ఇబ్బందులు..
స్థానిక శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం కి ప్రతినిత్యం వేలమంది ప్రైవేట్ వాహనాల్లో అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు ఆర్టీసీ బస్సుల్లో కూడా దూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి వచ్చి తమ మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు అయితే ఇటీవల ఆలయ ప్రధాన ద్వారం వద్ద ప్రమాదం జరగడంతో అధికారులు ఊరికి దూరంగా ఉన్న ప్రదేశాల వద్ద బస్సులు నిలుపుదల చేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు భక్తులను ఇబ్బందిలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ నుంచి వచ్చే బస్సులను మైత్రి మార్గం ద్వారా ఆలయం వద్ద నున్న కళ్యాణం జరుగు ప్రదేశం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకురావచ్చని అలాగే పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో బస్సు స్టాప్ ను ఏర్పాటు చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
