కాలువ పూడికతీత పనుల ప్రారంభం..
- ప్రారంభించిన మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి
మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ పట్టణంలోని డొంగుల ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో మురుగునీటి కాలువ పూడికతీత పనులను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సోదరుడు, మక్తల్ మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి శుక్రవారం ప్రారంభించారు.
మక్తల్ మున్సిపాలిటీ 4వ వార్డులోని డొంగుల ఆంజనేయస్వామి దేవాలయం ముందు ఉన్న మురుగునీటి కాలువలో మట్టి, పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగునీరు పొలాల్లోకి చేరడంతో పాటు ఆలయం ముందు నిలిచిపోతుందని స్థానికులు వాకిటి శేషగిరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
దీనిపై స్పందించిన వాకిటి శేషగిరి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సొంత నిధులతో ఇటాచి యంత్రం సహాయంతో కాలువ పూడికతీత పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పి.కె. నరసింహ, 5వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పెయింటర్ వెంకటేష్, ఆయకట్టు మాజీ అధ్యక్షుడు మామిళ్ల కిష్టప్ప, నాయకులు తిరుపతి వెంకటేష్, కత్తిరి నాగరాజ్, రాజేందర్, తిరుపతి నర్సింలు, లింగం, ఈసరి అంజి తదితరులు పాల్గొన్నారు. స్థానికులు తమ సమస్యను వెంటనే గుర్తించి సొంత నిధులతో కాలువ పూడికతీత పనులు చేపట్టిన వాకిటి శేషగిరికి కృతజ్ఞతలు తెలిపారు.
