తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా
ఆంధ్రప్రభ, విజయవాడ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తిరుమలలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు శ్రీవారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
