Rs-50000-Crore-Investment : 50 వేల కోట్లు పెట్టుబడి పెడ్తున్నాం
Rs-50000-Crore-Investment : 50 వేల కోట్లు పెట్టుబడి పెడ్తున్నాం
- 50 వేల మందికి ఉపాధి లభిస్తుంది
- రాయలసీమ స్టీల్ విస్తరిస్తాం
- ప్ర స్తుతం 10 లక్షల టన్నుల సామర్థ్యం
- చంద్రబాబు విజన్ లీడర్
- దేశంలోనే అరుదైన నాయకుడు
- జిందాల్ గ్రూస్ చైర్మన్ సజ్జన్ జిందాల్
(ఆంధ్రప్రభ, కడప బ్యూరో )
rs-50000-crore-investment : ఏడాదికి 10 లక్షల టన్నుల సామర్ధ్యంతో నిర్మితం అవుతున్న రాయలసీమ స్టీల్ ప్లాంట్ ను మరింతగా విస్తరిస్తాం. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో స్థానిక యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని జిందాల్ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించిన అనంతరం సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నా. లాంటి విజన్ ఉన్న నాయకులు దేశంలో చాలా అరుదుగా ఉన్నారు . ఆయన వచ్చే 25 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి గురించి ఆలోచన చేసి అమలు చేస్తారు. సీఎం చంద్రబాబు చేసిన విజన్ వల్లే ఉమ్మడి ఏపీలో సైబరాబాద్ నగరం ఐటీ హబ్ గా ఎదిగింది. దేశాభివృద్ధి గురించి నిత్యం ఆలోచించే చంద్రబాబు లాంటి నేతలతో కలిసి పనిచేయటం పారిశ్రామిక వేత్తగా నాకు గౌరవం ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చంద్రబాబు లాంటి సీఎంలు ఉంటే మరింత వేగంగా లక్ష్యాలను అందుకోగలం ఇవాళ రాయలసీమ స్టీల్ ప్లాంట్, ఎనర్జీ ప్లాంట్‌తో పాటు విజయనగరం జిల్లాలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తున్నాం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తరపున దాదాపు రూ.50 వేల కోట్ల మేర పెట్టుబడులు పెడతాం, ఈ పెట్టుబడులతో 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ తయారు చేసే ఉక్కు, ఇంధనం రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని సజ్జన్ జిందాల్ ఆశాభావం వ్యక్తం చేశారు,
