అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎస్సైకి సన్మానం

అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నరేష్‌ను అంబేద్కర్ యువజన సంఘం అచ్చంపేట డివిజన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, అచ్చంపేట ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్సై నరేష్ సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం, నాయకులు బీసమొల్ల ఆనంద్, కొంకి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైటప్: నూతన ఎస్సై నరేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరిస్తున్న అంబేద్కర్ యువజన సంఘం అచ్చంపేట డివిజన్ అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం, తదితరులు.