మోత్కూర్ చేనేత సంఘ ఎన్నికలకు 21 నామినేషన్లు..
మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూర్ చేనేత సహకార సంఘంలో జూలై 10 న జరిగే ఎన్నికలలో భాగంగా గురువారం స్థానిక చేనేత సహకార సంఘ భవనంలో 9 మంది డైరెక్టర్ల స్థానాలకు గాను 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 7 జనరల్ స్థానాలకు 17 మంది, మహిళా రిజర్వేషన్ 2 స్థానాలకు 4 గురు, మొత్తం 21 మంది తొలి రోజు డైరెక్టర్ పదవుల కోసం నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి సయ్యద్ సుజాత్ అలీ తెలిపారు.ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం మేనేజర్ వేముల నరసయ్య , దోర్న గోపయ్య తదితరులు పాల్గొన్నారు.
