ప్రభుత్వ బడుల విద్యార్థులకు అమెరికా విద్య..
దిక్సూచి ఫౌండేషన్ ప్రతినిధులు..
జన్నారం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ బడుల విద్యార్థులకు ఆన్లైన్లో అమెరికా విద్యను అందించనున్నట్లు దిక్సూచి ఫౌండేషన్ ప్రతినిధులు, యూఎస్ఏ వాసులు గాజుల లాస్య, తిరుమలశెట్టి హంసిని తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అక్కపల్లిగూడ, ధర్మారం ప్రభుత్వ పాఠశాలలను గురువారం వారు సందర్శించి, ఇంగ్లీష్ భాషలో విద్యార్థుల సమర్థ్యాన్ని పలు ప్రశ్నలు వేసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యుఎస్ఏ నుంచి గత సంవత్సర కాలంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యాపరంగా విద్యార్థులను మరింత బలోపేతం చేయడానికి తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని, ప్రస్తుతం విద్యార్థుల సామర్థ్యం పట్ల వారు వ్యక్తం చేశారు.

అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన వారి కుటుంబాలకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు జాజాల శ్రీనివాస్, ఎంబడి సత్తన్న, పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి జక్కు సుష్మ- భూమేష్, వార్డు సభ్యురాలు ఎం.హారిక- రవిలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దిక్సూచి ఫౌండేషన్ సభ్యులు బండారి మారుతీరాజ్, కె.ఎ నర్సింహులు, అంకం మహేష్, గాజుల దేవేందర్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు శెట్టి రాజశేఖర్, తరాల సుదీప, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
