Minister Ponguleti | కాంగ్రెస్ వెనక్కి తగ్గదు
Minister Ponguleti | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ తీవ్రస్థాయిలో స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ…. టెండర్ల విలువ కంటే మూడు రెట్లు ఎక్కువ అవినీతి జరిగిందని ఆరోపించడం ద్వారా బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
చర్చకు వెనకడుగు వేసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. గన్‌పార్క్ వద్ద మంత్రులు గంటసేపు వేచి ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ భవన్‌లో చిట్‌చాట్‌లతో కాలక్షేపం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉంటుందని అన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల తీరు గూండాగిరిలా ఉందని, అలాంటి వ్యవహారాలకు కాంగ్రెస్ భయపడదని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఇదే తీరు కొనసాగిస్తే భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు.
పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ అహంకారంతో వ్యవహరించి ప్రజలను పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వివరించారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ మాట్లాడడం బాధ్యతారాహిత్యమని, ప్రజలు ఐదేళ్ల పాలనకు ఇచ్చిన తీర్పును గౌరవించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
