కార్మిక సంక్షేమ బోర్డు స్కీములను యధావిధిగా కొనసాగించాలి

కార్మిక సంక్షేమ బోర్డు స్కీములను యధావిధిగా కొనసాగించాలి

చిట్యాల, ఆంధ్రప్రభ : భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీ లకు అప్పజెప్ప వద్దని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చిట్యాల మండల కేంద్రంలో బుధవారం నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం ( సిఐటియు) చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు..అనంతరం చిట్యాల డిప్యూటీ తహశీల్దార్ విజయ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.