అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ..
అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ..
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని రేకులతండా లో అంగన్వాడీ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేసముద్రం మున్సిపల్ చైర్పర్సన్ బానోత్ సునీత వెంకన్న హాజరై పిల్లలకు ఉచితంగా యూనిఫాం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మాదిరిగానే అంగన్వాడీ చిన్నారులకు కూడా ఒకే రకమైన దుస్తులు (యూనిఫాం) అందించడం వల్ల వారిలో చిన్నప్పటి నుంచే సమానత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు.
ఉచితంగా రెండు జతల దుస్తులు అందించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా, ఆరోగ్య, పోషకాహార సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయ, అంగన్వాడి దుర్గ టీచర్, స్థానికులు తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.
