రోటరీ క్లబ్ జేమ్స్ కు 15 అవార్డులు..

రోటరీ క్లబ్ జేమ్స్ కు 15 అవార్డులు..

నిజామాబాద్, సాంస్కృతికం, ఆంధ్రప్రభ : రోటరీ ఇంటర్నేషనల్ శోభితం అవార్డ్స్ నైట్‌లో ఘన విజయాన్ని సాధించిన రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్, నిజామాబాద్ కు15 అవార్డులు వచ్చాయి. హైదరాబాదు లో రోటరీ 3150 ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మకమైన శోభితం అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్, నిజామాబాద్ పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు, ప్రశంసలను అందుకొని క్లబ్‌కు విశేష గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ అవార్డులు సమాజ సేవ పట్ల క్లబ్‌కు ఉన్న అంకితభావానికి, సేవా కార్యక్రమాల విజయానికి నిదర్శనం.క్లబ్‌కు

అడాప్ట్ – సిల్వర్
కంప్లయన్స్ – సిల్వర్
ఎంగేజ్‌మెంట్ – సిల్వర్
ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ – సిల్వర్
మెంబర్‌షిప్ గ్రోత్ రిటెన్షన్ సిల్వర్,రీచ్ – బ్రాంజ్

యాక్షన్ ప్లాన్ ఛాంపియన్స్ – సిల్వర్, అవార్డులు లభించాయి.అంతేకాకుండా, క్లబ్ చేపట్టిన విశిష్ట సేవా కార్యక్రమాలకు సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్ అవార్డులు కూడా లభించాయి:.వ్యాధుల నివారణ బహుళ రక్తదాన శిబిరాల నిర్వహణ
విద్యా ప్రోత్సాహం: బాల బాలికల యుక్తవయస్సు అవగాహన కార్యక్రమం
ఇవే కాకుండా, సేవా కార్యక్రమాల అమలుకు ప్రశంసా పత్రాలు అందుకున్నది.బాలికలకు పునర్వినియోగించగల శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీ
వలస కార్మికులకు శీతాకాల దుప్పట్ల పంపిణీ,

అర్హులైన లబ్ధిదారులకు కుట్టు యంత్రాలు మరియు ఎల్పిజి ఇస్త్రీ పెట్టెల పంపిణీ కార్యక్రమాలకు ఈ అవార్డులు రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్, నిజామాబాద్ సభ్యుల అంకితభావం, సమిష్టి కృషి, సేవా తపనకు నిదర్శనం. రోటరీ సిద్ధాంతమైన “సేవే పరమ ధర్మం అని ఈ సంవత్సరపు థీమ్ యూనిట్ ఫర్ గుడ్ ను కార్యరూపంలో నిలబెట్టడంలో క్లబ్ విశేషంగా కృషి చేసింది.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రో. పాకాల నరసింహారావు మాట్లాడుతూ, ఈ విజయానికి సహకరించిన రోటరీ జిల్లా 3150, క్లబ్ సభ్యులు, దాతలు, స్వచ్ఛంద సేవకులు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సమాజానికి మరింత ప్రయోజనం చేకూర్చే సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి క్లబ్ కట్టుబడి ఉందని పాకాల నరసింహ రావు తెలిపారు.