Amarnath Yatra | భక్తుల వాహనం బోల్తా.. ముగ్గురు మృతి
Amarnath Yatra | భక్తుల వాహనం బోల్తా.. ముగ్గురు మృతి
Amarnath Yatra | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులకు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని బఠిండా జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న వాహనం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అమర్‌నాథ్ యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో అమర్‌నాథ్ యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
