పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉచిత వైద్య శివరాలతో గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్యం అందజేయడమే లక్ష్యమని ఉరవకొండ పి ఏ సి ఎస్ చైర్మన్ ప్యారం కేశవానంద అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సహకార సమృద్ధి – సమగ్ర అభివృద్ధి ప్రత్యేక సహకార వారోత్సవాల సందర్భంగా ఉరవకొండ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని పిఏసి ఎస్ చైర్మన్ ప్యారం కేశవా నంద ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా డాక్టర్ వినుత మాట్లాడు తూ వైద్య శిబిరంలో ఎక్కువ మంది పేద ప్రజలు చికిత్స పొందారన్నారు. ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమానికి పి ఏ సి ఎస్ పర్సన్లు కురువ నాగేంద్ర, నాగ ప్రమీలమ్మ, ఏ డి సి సి బ్యాంక్ మేనేజర్ ఉమాపతి, కుమార్, పిఎసిఎస్ సీఈవో మహమ్మద్ గౌస్, ఎం ఎల్ హెచ్ పి సాజిదా, వైష్ణవి, సల్మా భాను, రేణుక తదితరులు పాల్గొన్నారు.