విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ
విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ
దండేపల్లి, ఆంధ్రప్రభ :దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిగ్ ఎల్ఫ్ ఫార్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు మండల విద్యాధికారి మంత్రి రాజు, తన చేతుల మీదుగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు తదితర విద్యా సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ. విద్యార్థులు విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. పేద విద్యార్థులకు ఇటువంటి వస్తువులు చదువుకోవడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమకు అందిన వస్తువులను సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బిగ్ ఎల్ఫ్ ఫార్ ఎడ్యుకేషన్ సంస్థ డైరెక్టర్ యండి శరీఫోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
