జనవిజ్ఞాన వేదిక పోస్టర్ ఆవిష్కరణ
శావల్యాపురం, ఆంధ్రప్రభ : సమాజంలో శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యత, మానవతా విలువలను పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక విశేష కృషి చేస్తోందని జన విజ్ఞాన వేదిక మండల గౌరవ అధ్యక్షుడు కె.వి.ఆర్. మోహన్ చంద్ అన్నారు. మండల కేంద్రమైన శావల్యాపురం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో బుధవారం జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు ప్రచార పోస్టర్ను ఎంఈఓలు మద్దికుంట సాంబశివరావు, పుసులూరి లలిత కుమారి, జన విజ్ఞాన వేదిక మండల గౌరవ అధ్యక్షులు కె.వి.ఆర్. మోహన్ చంద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆసక్తి గల వ్యక్తులను గుర్తించే ఉద్దేశంతో ప్రత్యేక ఆన్‌లైన్ ఫారమ్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా కె.వి.ఆర్. మోహన్ చంద్ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, ఉద్యోగులు, వివిధ రంగాల ప్రజలు పెద్ద సంఖ్యలో జన విజ్ఞాన వేదిక సభ్యత్వం తీసుకుని సంస్థ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదికలో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరి సమాజాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు ఎ. వసంతరావు, మండల ప్రధాన కార్యదర్శి బి. త్రివిక్రమ్, సభ్యులు పి. సురేష్ కుమార్, ఈ. శ్రీనివాసరావు, కె. ఏడుకొండలు, కె. జగన్మోహన్ రెడ్డి,ఎల్. శ్రీహరి, పి.పార్వతి పాల్గొన్నారు. సభ్యత్వ ఆసక్తి నమోదు లింక్:
https://forms.gle/uV63dFDcv7aJQbdK6
