కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి
నాలుగు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. బుధవారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 5, 10, 39 37 వార్డుల్లో లబ్ధిదారుల ఇంటికి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులతో కలిసి లబ్ధిదారుల వద్దకే వెళ్లారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులను, మంచానికే పరిమితమైన వారిని ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పింఛను సొమ్ములను అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సత్వరం పెంచి ఇస్తున్న పింఛను సొమ్ములు కారణంగా లక్షలాది కుటుంబాలకు ఆసరా లభిచిందన్నారు. చాలామంది లబ్ధిదారులు పింఛను సొమ్ములు పెంచి ఇస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్తుడడంతో సంతోషంగా ఉందన్నారు.
కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. ప్రజలకు మంచి పనులు.. మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహ ప్రసాద్, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, సహాయ కమిషనర్ ఎ. ప్రసాద్, కూటమి నాయకులు బీఎన్ రాజసింహులు, కవిత, అముద, రాజేష్ కుమార్ రెడ్డి, నరేష్, క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
