rotten chicken | ఫిషరీస్ యజమానికి జరిమానా
rotten chicken | ఫిషరీస్ యజమానికి జరిమానా
సికింద్రాబాద్‌లోని ఈగల్ ఫిషరీస్‌లో తనిఖీలు నిర్వహించిన హెచ్-ఫాస్ట్ బృందం
కుళ్లిన చికెన్ నిల్వలను గుర్తించి నిందితుడిని వెటర్నరీ శాఖకు అప్పగింత
rotten chicken | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ మాంసం విక్రయ కేంద్రంలో కుళ్లిన చికెన్ నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి యజమానిపై చర్యలు చేపట్టారు. నిల్వలో ఉన్న పాడైపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు.
హెచ్-ఫాస్ట్ (H-FAST) ఎస్ఐ పి. అభిలాష్, జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యుడు డాక్టర్ వాసుతో కలిసి సికింద్రాబాద్‌లోని ఈగల్ ఫిషరీస్ దుకాణంపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన కుళ్లిన చికెన్ నిల్వలను అధికారులు గుర్తించారు. అనంతరం దుకాణ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం వెటర్నరీ శాఖ అధికారులకు అప్పగించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.3,000 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా నాసిరకం లేదా కుళ్లిన మాంసాన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఆహార పదార్థాల నాణ్యతపై ఎవరైనా అనుమానాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
