సుబ్రహ్మణ్యుడుకి నీరాజనం

ప|| షణ్ముణా నెమలి వాహనా భక్తవత్సలా
సుబ్రహ్మణ్య ఉమా సుతునికీ నీరాజనం.

అను|| శంకరాత్మజా చంద్ర వర్ణ తారకాసుర
సంహారా సుర సైన్యసురక్షకా గిరిజా
తనయకు స్కంధనకు నీరాజనం.

చ|| వల్లిదేవ సేనాపతిగా పుళింద కన్యా
రోగ నాశన నా ప్రాణాయామ పరాయణా
తేజోనిధికీ వేదగర్భకూ మేనకాత్మజా
తనయునకు నీరాజనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *