ఇద్దరికి ఎల్.ఓ.సీలు అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు ఇద్దరు లబ్ధిదారులకు వైద్య చికిత్స కోసం మంజూరైన ఎల్.ఓ.సీ లను అందజేశారు. కొరం పృథ్వీరాజ్ (గుంటుపల్లి)కు రూ.3,83,339 విలువైన ఎల్.ఓ.సీని, పామర్తి వీరబాబు (కొత్తూరు తాడేపల్లి)కు రూ.1,15,776 విలువైన ఎల్.ఓ.సీని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వయంగా అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్.ఓ.సీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఎల్.ఓ.సీలు అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తమకు అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందించిన సీఎం చంద్రబాబు గారికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
