murder case | గుండెపోటుగా చిత్రీకరించే యత్నం

murder case | గుండెపోటుగా చిత్రీకరించే యత్నం

murder case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో అనుమానాస్పద మృతిగా కనిపించిన ఘటన హత్య కేసుగా మారింది. భార్య అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే అనుమానంతో ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం… భర్తను ఉరివేసి హత్య చేసిన అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే మృతుడి మెడపై గాయాల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, విచారణలో లభించే వివరాల ఆధారంగా పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.