గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం

స్నాతకోత్సవ వేడుకల కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్

మంత్రి నారా లోకేశ్, మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు ప్రజాప్రతినిధుల ఘన స్వాగతం

అనంతపురం, ఆంధ్రప్రభ: అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు బుధవారం ఘన స్వాగతం లభించింది. విశ్వవిద్యాలయ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, రియల్‌టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికి, అక్కడికి విచ్చేసిన ప్రముఖులకు పరిచయం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్, ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.