భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌పై జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌పై జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

రికార్డులు, పెండింగ్ కేసులు, సీసీ కెమెరాల పనితీరుపై సమీక్ష

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: జిల్లాలో పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజలకు నాణ్యమైన, పారదర్శక పోలీసు సేవలు అందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు.