పెద్దవంగర నూతన ఎంపీడీవోగా సురేష్ బాధ్యతల స్వీకరణ
పెద్దవంగర, ఆంధ్రప్రభ: పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) వి. సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై పెద్దవంగర ఎంపీడీవోగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా వి. సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సత్వరంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు. కాగా, ఇక్కడ ఎంపీడీవోగా పనిచేసిన బోడేపూడి వేణుమాధవ్ ఇటీవల పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
