june29indrakeeladri ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్:  విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29-06-2026 నాటి గణాంకాల ప్రకారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ ఒక్కరోజు మొత్తం 58,75 టికెట్ల ద్వారా దర్శనాలు జరగగా, 39,388 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదాల విక్రయం ద్వారా 57,639 యూనిట్లు నమోదు కాగా, రూ.3,14,705 ఆదాయం లభించింది. అదేవిధంగా 519 సేవలు, 1,351 టాన్సురింగ్ (ముండనాలు), 7,931 అన్నదానం భోజనాలు నిర్వహించినట్లు ఆలయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

భక్తుల రద్దీతో పాటు అన్నదానం, సేవలు, ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయని ఆలయ వర్గాలు తెలిపాయి.