హమాలీల అర్ధనగ్న నిరసన.. సమస్యల పరిష్కారానికి డిమాండ్
నరసాపురం, ఆంధ్రప్రభ: సివిల్ సప్లై కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. స్థానిక ఎఫ్సీఐ గోదాం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, 2026 జనవరి 1 నుంచి వేతనాలు పెంచాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఎఫ్సీఐ గోదాంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, పట్టణ కన్వీనర్ కోడి లక్ష్మణ్, నోములకొండ అరవ శ్రీనివాస్, మల్లుల రామచక్రవర్తి, రవి, రామకృష్ణ, నాగేశ్వరరావుతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
