Death Sentence- : 65 ఏళ్ల రేపిస్టుకి ఉరి Andhra prabha Crime News
Death Sentence- : 65 ఏళ్ల రేపిస్టుకి ఉరి Andhra prabha Crime News
- మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం
- పుణె సెషస్స్ కోర్టు సంచలన తీర్పు
- 60 రోజుల విచారణలో దోషి నిర్దారణ
( ఆంధ్రప్రభ, పుణె)
Death Sentence- : కామంతో మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేసిన ముసలి కీచకుడికి పూణె జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.ఆర్. సాలుంఖే ఈ తీర్పును వెలువరించారు; నేరం జరిగిన కేవలం 60 రోజుల్లోనే తీర్పు వెలువడటంతో, మహారాష్ట్రలో అత్యంత వేగంగా ముగిసిన మరణశిక్ష కేసులలో ఇది ఒకటిగా నిలిచింది. అత్యాచారం అనంతరం హత్య చేసినందుకు, 65 ఏళ్ల భీమ్‌రావ్ కాంబ్లేను దోషిగా జూన్ 25న నిర్ధారించినప్పటికీ, శిక్షపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. మరణశిక్షను ఖరారు చేస్తూ, న్యాయమూర్తి ఈ నేరం క్రూరత్వాన్ని తీవ్రంగా ప్రస్తావించారు. గరిష్ట శిక్షకు అర్హమైన “అత్యంత అరుదైన” కేసుగా అభివర్ణించారు. తీర్పును చదివి వినిపించే సమయంలో, ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.ఆర్. సాలుంఖే నిందితుడి క్రూరత్వాన్ని కఠినమైన పదజాలంతో తీవ్రంగా విమర్శించారు.
Death Sentence- : మే 1న కిరాతకం
పుణె జిల్లా నస్రాపూర్‌లో మే 1న నిందితుడు సుమారు 39 నిమిషాల పాటు మూడున్న సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి చేసి, హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత పూణేతో సహా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్లు వచ్చాయి.
Death Sentence- : ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి, దీని విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరపాలని నిర్ణయించింది. పూణే రూరల్ పోలీసులు కేవలం 16 రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఆ తర్వాత కోర్టులో విచారణ వేగంగా సాగింది. ఈ కేసులో 55 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు, సీసీటీవీ ఫుటేజీతో సహా వివిధ సాంకేతిక ఆధారాలను కూడా కోర్టు ముందు సమర్పించారు.
