చిన్నకాపర్తి పాలకేంద్రం చైర్మన్ గా దాసరి సైదులు

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలను సోమవారం నిర్వహించారు.

నూతన చైర్మన్ గా దాసరి సైదులు, డైరెక్టర్లుగా మెట్టు పద్మ, సండ్రాల శేఖర్ రెడ్డి, ఎడ్ల మల్లయ్య, మెట్టు ఇందిరమ్మ, అమృతరెడ్డి, పాకాల యాదయ్య, పొలిమెర లింగయ్య, మెట్టు ఎల్లమ్మ, మామిడి శ్రీను ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన చైర్మన్, డైరెక్టర్లను సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ శాలువాలతో సన్మానించి అభినందించారు. సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ పాల సంఘం అభివృద్ధికి ఎన్నికైన వారు కృషి చేయాలని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వలిగొండ సత్యనారాయణ, ఆవుల గోపాల్, పెద్దులు, దాసరి గణేష్, మిద్దె రమేష్ తదితరులు పాల్గొన్నారు.