చెట్టుపై నుండి పడి గీత కార్మికునికి గాయాలు..

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : తాటి చెట్టుపైనుండి పడి జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పాలకుర్తి చిన్న రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. రోజు లాగే చెట్టు ఎక్కుతుండగా జారి కిందపడ్డాడు. గమనించిన తోటి గీత కార్మికులు హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గీత కార్మికుడు చిన రాములు ను ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం నాయకులు కోరారు.