July20,26 | ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగావకాశం..జూన్ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ

July20,26 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ రంగంలో ఇంజినీరింగ్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జెన్‌కో) శుభవార్త తెలిపింది. సంస్థలో ఖాళీగా ఉన్న 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 20, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
ఎలక్ట్రికల్ – 52 పోస్టులు
మెకానికల్ – 21 పోస్టులు
సివిల్ – 20 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ – 7 పోస్టులు

మొత్తం ఖాళీలు : 100
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏఐసీటీఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఏఎంఐఈ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి : కనిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు : 42 సంవత్సరాలు (జులై 1, 2026 నాటికి)

వయో సడలింపు : ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు – 10 సంవత్సరాలు
వేతనం : ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 వేతనం చెల్లిస్తారు. అనంతరం పే స్కేల్ ప్రకారం జీతభత్యాలు అందుతాయి.
ఎంపిక విధానం : అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, అనంతరం సర్టిఫికెట్ ధ్రువీకరణ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం : పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. కోర్ సబ్జెక్ట్ – 70 మార్కులు, సాధారణ మేధస్సు, తార్కిక సామర్థ్యం – 5, మార్కులు, సాధారణ అవగాహన – 7 మార్కులు, ఆంగ్ల భాష, అవగాహన – 5 మార్కులు, గణిత సామర్థ్యం – 8 మార్కులు, కంప్యూటర్ పరిజ్ఞానం – 5 మార్కులు.
నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
దరఖాస్తు విధానం : దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.
దరఖాస్తు రుసుము : రూ.1,000
ముఖ్యమైన తేదీలు : దరఖాస్తుల ప్రారంభం : జూన్ 30, 2026 (ఉదయం 10 గంటల నుంచి)
చివరి తేదీ : జులై 20, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)
నమూనా ఆన్‌లైన్ పరీక్షలు : ఆగస్టు 15, 2026 నుంచి
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు : ఆగస్టు 22 నుంచి 29, 2026 వరకు
ప్రాథమిక ఆన్సర్ కీ : చివరి పరీక్ష జరిగిన రెండు రోజుల తర్వాత
తుది మెరిట్ జాబితా : సెప్టెంబర్ చివరి వారంలో
పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బెర్హంపూర్ నగరాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగంతో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఈ నియామకాలు మంచి అవకాశంగా నిలవనున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.