వరంగల్ సభకు తరలివెళ్లిన కేసముద్రం బీజేపీ శ్రేణులు

  • బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్

కేసముద్రం, ఆంధ్రప్రభ : ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ స్థాయి, ఆపై స్థాయి నాయకుల భారీ సమావేశానికి కేసముద్రం మండల బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. బిజెపి కేసముద్రం మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఒక ప్రత్యేక బస్సులో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి పయనమయ్యారు. వరంగల్‌లో నిర్వహించిన ఈ ముఖ్యమైన సమావేశానికి బీజేపీ జాతీయ నాయకులు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ఈ సభను నిర్వహించారు. గ్రామీణ, బూత్ స్థాయిల నుండి పార్టీని బలోపేతం చేయడం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణలో బీజేపీ విజయభేరి మోగించడం ఖాయమని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండలానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకులు రామడుగు వెంకటాచారి, అయిత సారయ్య, జమ్ముల గోపాల్ రెడ్డి, సోమరాజ్, జుజ్జూరు వీరభద్ర చారి, బానోత్ రాము, గుండు దామోదర్, సీతారాం నాయక్, భూక్య విజయ్, బానోతు రవి, బోడ వినోద్, బోడ వెంకన్న, ముత్యం ఉమేష్, పోలేపల్లి సంపత్ రెడ్డి, బెజ్జం సురేష్, ఎలబోయిన కరుణాకర్, పరకాల మురళి, మంగిశెట్టి నాగయ్య, చిట్టోజు చక్రధర్, బీరం రవీందర్ రెడ్డి, బేతి వెంకన్న, ఒంటెల ప్రభాకర్ రెడ్డి, జాటోత్ నరేష్, పూర్ణ కంటి భాస్కర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.