తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలి
- మంత్రి జూపల్లికి జేఏసీ వినతి
బాసర, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర ఎనలేనిదని, వారి సేవలను గుర్తించి తగిన గుర్తింపు కల్పించాలని కోరుతూ బాసర జేఏసీ చైర్మన్ మనోహర్ రావు ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తూ చివరి వరకు పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసి, వారి సేవలకు తగిన గౌరవం అందించాలని మంత్రి ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.
