పల్స్ పోలియో విజయవంతం..

  • 91.8 శాతం నమోదు

మోత్కూర్, ఆంద్రప్రభ : నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరి అని,పోలియో నిర్ములనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న అన్నారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోత్కూర్ మున్సిపల్ , మండల పరిధిలోని 22 బూత్ లలో మొత్తం పిల్లలు 0 నుండి 5 సంవత్సరాల 1647 మంది మొత్తం చిన్నారులకు గాను 1510 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయగా 91.8 శాతం నమోదైంది.ట్రాన్సిట్ పాయింట్(ఇతర మండల పిల్లలు) బస్టాండ్ ఏరియా లో 57 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు డా నిరోషా తెలిపారు. మొత్తం 1567 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నిరోషా ,సుపర్ వైజర్ లు యాకయ్య, ఊర్మిళ , ఏ ఎన్ ఎం జిట్ట సైదమ్మ,ఆసుపత్రి సిబ్బంది మధు , పి స్వాతి , వెంకన్న , ఆశ కార్యకర్త రహీంబీ తదితరులు పాల్గొన్నారు