బిజెపి నేతల ముందస్తు అరెస్టు..

మునుగోడు, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా మునుగోడు మండలానికి చెందిన బీజేపీ నాయకులను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నుంచి ఎలాంటి నిరసన పిలుపు లేకున్నా ఉదయం 4 గంటలకే అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాదగోని నరేందర్ గౌడ్, మండల అధ్యక్షుడు పెంబళ్ల జానయ్య విమర్శించారు.ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.అక్రమ అరెస్టులు,నిర్బంధాలకు బీజేపీ నాయకులు భయపడరని అన్నారు. అరెస్టైన వారిలో అక్కినపల్లి సతీష్, పందుల యాదయ్య, ఓడిగె స్వామి, పెర్లుమాండ్ల రాము, పోలే వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.