ఒకే కేసులో సిఐ, ఎస్.ఐలను సస్పెన్షన్..

  • వరుస ఘటనలతో అవినీతి అధికారులలో గుబులు

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : వరంగల్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణల పోలీస్ అధికారులపై కొరడా జలుపిస్తున్నాడు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. శనివారం అవినీతి ఆరోపణల కారణంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావును విఆర్ కు అటాచ్ చేస్తు ఆరోపణల విచారణ పూర్తయ్య వరకు అటాచ్ కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదే కొనసాగింపుగా ఆదివారం వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ యం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్.ఐ గా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్.ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన అధికారులు పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తునట్లుగా సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.