న్యాయవాదులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు గర్హనీయం

వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రసాద్ రెడ్డి

శ్రీ సత్య సాయి , ఆంధ్రప్రభ : తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి న్యాయవాదులపై చేసిన వ్యాఖ్యలను శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రీజినల్ జిల్లా అధ్యక్షుడు వి. ప్రసాద్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయవాదులకు “లా తెలియదు” అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడడం జేసీ ప్రభాకర్‌రెడ్డి అహంకారానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

వయస్సులో పెద్దవారైనప్పటికీ న్యాయవాదులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వెంటనే ఆయన న్యాయవాదులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లాలోని న్యాయవాదులతో కలిసి రాజ్యాంగబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.