పోలియో చుక్కలతో బాల్యం సురక్షితం..

రుద్రూర్, ఆంధ్రప్రభ : పల్స్ పోలియో చుక్కలతో బాల్యం సురక్షితమని సర్పంచ్ రమేష్ అన్నారు. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో సర్పంచ్ 0-5 వయసులోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను ఆదివారం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పల్స్ పోలియో రెండు చుక్కలు పిల్లల భవిష్యత్తును కాపాడుతుందన్నారు. పోలియో అనేదే ఒక వైరస్ వల్ల వచ్చే భయంకరమైన వ్యాధి అని దీనికి చికిత్స లేదని నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. చిన్నారుల బంగారు భవిష్యత్తు బాగుండాలని ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, వీడీసీ అధ్యక్షులు కురుమే రాజు, వార్డు సభ్యులు జల్లా సాయిలు, గోపి, జ్యోతి, అశోక్, ఏఎన్ ఎం జ్యోతి,ఆశా కార్యకర్త పద్మ అంగన్వాడి టీచర్, తదితరులు పాల్గొన్నారు.