భగత్‌సింగ్ నగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్‌లోని భగత్‌సింగ్ నగర్‌లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
పట్టణంలోని పలు పోలియో కేంద్రాల్లో వైద్య సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారని, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మిట్టపల్లి సరిత శ్రీనివాస్, 1వ వార్డు కౌన్సిలర్ కౌడగాని సాంబయ్య, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ గాండ్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.
