పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి : సర్పంచ్ చలిమేటి నరేందర్

పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి : సర్పంచ్ చలిమేటి నరేందర్

నిజాంపేట, ఆంధ్రప్రభ : ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కల మందు తప్పనిసరిగా వేయించాలని నిజాంపేట గ్రామ సర్పంచ్ చలిమేటి నరేందర్ అన్నారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలియో నిర్మూలనలో ప్రతి తల్లిదండ్రి భాగస్వాములు కావాలని కోరారు. ఐదేళ్లలోపు ఒక్క చిన్నారిని కూడా పోలియో చుక్కలకు దూరం చేయకుండా సమీప పోలియో కేంద్రానికి తీసుకువచ్చి మందు వేయించాలని సూచించారు. పోలియో శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ, పల్స్ పోలియో చుక్కల ద్వారా దానిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్‌పీ సంధ్య, ఏఎన్‌ఎం బాలమణి, ఆశా వర్కర్లు అనిత, లక్ష్మి, బాలమణి, వార్డు సభ్యులు దుర్గయ్య, నాయిని లక్ష్మణ్, మల్లేశం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.