ఎగిసి పడుతున్న ఇసుక.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు..
ఎగిసి పడుతున్న ఇసుక.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు..
టేకుమట్ల , ఆంధ్రప్రభ : రోడ్డుపై ఎగిసిపడుతున్న ఇసుక రేణువులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వేగంగా వెళ్తున్న వాహనాల కారణంగా దుమ్ము, ఇసుక గాలిలోకి ఎగిరి కళ్లలో పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కళ్లలో మంట, దురదతో పాటు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు తక్షణమే, ఇసుక రవాణా వాహనాలకు పరదా కప్పివేసి తరలించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు
