రజకులకు రూ.10 లక్షల రుణాలు మంజూరు చేయాలి..

కేసముద్రం, ఆంధ్రప్రభ : రజక వృత్తిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల రుణ సౌకర్యం కల్పించాలని రజక సంఘం రాష్ట్ర నాయకులు చాగంటి కిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కష్టపడి జీవనం సాగిస్తున్న రజకుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుండెడు గంజి కోసం బండెడు చాకిరి చేస్తున్న రజకుల జీవితాలు మరింత కష్టాల్లోకి నెట్టబడుతున్నాయని అన్నారు.

ఇటీవలి కాలంలో ప్రభుత్వం కులాల పేర్లలో మార్పులు చేసి ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని పెంపొందించే చర్యలు తీసుకోవడం స్వాగతించదగ్గ విషయమేనని పేర్కొన్నారు. అయితే సామాజిక గౌరవంతో పాటు ఆర్థికంగా కూడా బలోపేతం చేసే చర్యలు చేపట్టకపోతే ఆశించిన మార్పు సాధ్యం కాదన్నారు.

అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి, బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన ప్రతి రజక కుటుంబానికి రూ.10 లక్షల రుణ సౌకర్యం కల్పించి వారి జీవనోపాధికి చేయూతనివ్వాలని చాగంటి కిషన్ విజ్ఞప్తి చేశారు.