చల్లగరిగలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని చల్లగరిగె గ్రామంలో గ్రామ సర్పంచ్ సిరిపెల్లి జంపయ్య ఆధ్వర్యంలో శనివారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
కర్రె నర్సింహారెడ్డి ఇంటి ముందు నుంచి కమ్యూనిటీ హాలు కూడలి వరకు, అలాగే శివాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు భాగంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.
చాలా కాలంగా శిథిలావస్థకు చేరిన ఈ రహదారి కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ జంపయ్య తెలిపారు.
గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేష్, వార్డు సభ్యులు తోట సురేష్, శత్రు నాయక్, మూల మంజుల, కోడెపాక సునీత, మ్యాదరి జయ, దూదిపాల తిరుపతమ్మ, కాంగ్రెస్ నాయకులు నల్ల రాజిరెడ్డి, బైరిశెట్టి మహేందర్, దూదిపాల బుచ్చిరెడ్డి, జయపాల్ రెడ్డి, బండి రాజు తదితరులు పాల్గొన్నారు.
