రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నమోదు
- రైతు భరోసా దరఖాస్తులకు జూలై 5 చివరి తేదీ
- రైతు భరోసా కోసం కొత్త పాస్‌బుక్ తప్పనిసరి
- మండల విద్యాధికారి కృష్ణయ్య
అచ్చంపేట, ఆంధ్రప్రభ : రైతు భరోసా పథకం 2026–27 వానాకాలం సీజన్‌కు సంబంధించి కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు తప్పనిసరిగా తమ వివరాలను జూలై 5లోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాలని అచ్చంపేట మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య సూచించారు.
శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 2026 జూన్ 15 వరకు కొత్త పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వివరాలు, కొత్త పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చని హెచ్చరించారు.
ఇప్పటికే రైతు బంధు లేదా రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారు లేదా భూమి పేరుమార్పు జరిగిన రైతులు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అవసరమైన పత్రాలతో ముందుగానే దరఖాస్తు సమర్పించాలని మండల వ్యవసాయ అధికారి రైతులకు విజ్ఞప్తి చేశారు.
