పిడుగుపడి ఆవులు 21 మృతి

పిడుగుపడి ఆవులు 21 మృతి

ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడి వేడుకోలు

తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం అంకంపల్లి లో పిడుగుపడి 21 ఆవులు మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలం లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి ఒక్క సరిగా ఉరుములు మెరుపులు తో కూడిన భారీ వర్షం కురిసింది.దింతో పిడుగు పడి ఆకంపల్లి గ్రామానికి చెందిన మంకిడి సమ్మయ్య కు చెందిన ఆవుల పై పిడుగు పడి మృతి చెందినట్లు తెలిపారు.పశువులను మేపు కొని జీవనదారం
పోoదుతున్న తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలనీ బాధితుడు సమ్మయ్య కోరారు.