బాసర అమ్మవారిని దర్శించిన మాజీ కేంద్ర మంత్రి
బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సముద్రాల వేణుగోపాల చారి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించి, హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
అనంతరం ఇటీవల మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగిన చోరీ ఘటనపై ఆలయ ఈవోతో చర్చించారు. ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, సీసీ కెమెరాల సంఖ్యను పెంచి పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్‌తో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
