ప్రతివారం ప్రజా దర్బార్ ప్రజా హితం కోసమే.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.
పాయకాపురం, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతివారం ప్రజా దర్బార్ ప్రజా హితం కోసమేనని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, వైద్య, పెన్షన్, ఉపాధి, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు, ప్రతి వినతిని ఎమ్మెల్యే బొండా ఉమా శ్రద్ధగా పరిశీలించి, సమస్య తీవ్రతను తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి, అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, భార్గవ్, శివ, పార్టీ నాయకులు ఆకుల సూర్యప్రకాష్, కంచేటి నాగరాజు, బుదాల సురేష్, డిడి నాయుడు, బత్తుల కోటేశ్వరి కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
